అధ్యాత్మ సంకీర్తన
రేకు: 214-4
సంపుటము: 3-82
రేకు: 214-4
సంపుటము: 3-82
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| పాటించి నమ్మినవారి భాగ్యము గాదా కోటిసుద్దులేల యిదె కోరి చేకొనేది | ॥పల్లవి॥ |
| స్వామిద్రోహియైన చండి రావణాసురుఁడు కామించి శరణంటేను కాచేనంటివి యేమని నీదయ యెంతు నెంతని నీమహిమెంతు ఆమాటకు సరియౌ నఖిలవేదములు | ॥పాటిం॥ |
| దావతి సీతాద్రోహము దలఁచి కాకాసురుఁడు కావుమని శరణంటేఁ గాచితివి ఆవల నీపని యెట్టు అట్టే నీమన్నన యెట్టు యీవల నీశరణనే ఇందుసరే తపము | ॥పాటిం॥ |
| చిక్కులిన్నీ నిఁకనేల చేరి యేపాటివాఁడైన గక్కన నీశరణంటేఁ గాతువు నీవు అక్కరతో నిన్ను శరణంటిమి శ్రీవేంకటేశ యెక్కువ నీ బిరుదుకు యీడా పుణ్యములు | ॥పాటిం॥ |


