అధ్యాత్మ సంకీర్తన
రేకు: 215-3
సంపుటము: 3-87
రేకు: 215-3
సంపుటము: 3-87
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె పన్ని పరులఁ జెప్పఁగఁ జోటేది | ॥పల్లవి॥ |
| కుందని నీరోమకూపంబులలో గొందుల బ్రహ్మాండకోట్లట యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో యిందుఁ బరులమని యెంచఁగనేది | ॥ఇన్ని॥ |
| నీ కొనచూపున నెఱిఁ గోటిసూర్యు- లేకమగుచు నుదయింతురటా నీ కాయమెంతో నీ వునికేదో నీకంటెఁ బరులని నిక్కఁగనేది | ॥ఇన్ని॥ |
| జీవకోటి నీ చిన్నిమాయలో ప్రోవులగుచు నటు పొడమెనటా శ్రీవేంకటేశ్వర చెప్పఁగ నీవెంతో ఆవలఁ బరులకు నాధిక్యమేది | ॥ఇన్ని॥ |


