అధ్యాత్మ సంకీర్తన
రేకు: 218-2
సంపుటము: 3-97
రేకు: 218-2
సంపుటము: 3-97
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఈ తగవే నాకు నీకు నెంచి చూచితే కాతరపు జీవులకుఁ గలదా వివేకము | ॥పల్లవి॥ |
| భారము నీది గనక పలుమారుఁ బాపములే చేరి మొక్కలాన నేఁ జేసితిని పేరడిఁ దల్లిదండ్రులు బిడ్డ లేమి సేసినాను వోరుచుక ముద్దు సేసుకుందురు లోకమున | ॥ఈ త॥ |
| కావ నీవు గలవని కడదాఁకా నేరములే వేవేలు సేసితిని వెఱవక భావించుక యింటిదొర పసురము దెంచుకొని యేవిధిఁ బైరుమేసినా నెగ్గుసేయఁ డతఁడు | ॥ఈ త॥ |
| పుట్టించేవాఁడవు నీవు పొదలేవారము నేము యెట్టుండినా నీకుఁ బోదు యెన్నటికిని వొట్టుక శ్రీవేంకటేశ వోడఁగట్టిన దూలము అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు | ॥ఈ త॥ |


