అధ్యాత్మ సంకీర్తన
రేకు: 219-3
సంపుటము: 3-104
రేకు: 219-3
సంపుటము: 3-104
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| మఱచిన వెఱచిన మఱి లేదు యెఱిఁగిన సులభుఁడు యీ హరి యొక్కఁడే | ॥పల్లవి॥ |
| అతుమ తొల్లొటిదే అంతరాత్మ తొల్లిటిదే నీతితో యీదేహములే నిత్యకొత్తలు యీతల నేర్పరులకు నిందే యిహపరములు చేతిలో నున్నవి యిది చింతించరో జనులు | ॥మఱ॥ |
| కాలము నెందూఁ బోదు కర్మము నెందూఁ బోదు జాలిఁబడ్డ మనసే సావివోయను పోలింప వివేకులకు పుణ్యమునుఁ బాపమును వేళవేళనే వున్నవి వెదకరో జనులు | ॥మఱ॥ |
| ఆఁకలినిఁ దీరదు అన్నమునుఁ దీరదు తేఁకువ తన ధైర్యమే తీరెఁగాని తాఁకక శ్రీవేంకటేశుదాసులై తేఁ జాలుఁగాని కాఁక దీరు నిందరికిఁ గనుకోరో జనులు | ॥మఱ॥ |


