అధ్యాత్మ సంకీర్తన
రేకు: 219-5
సంపుటము: 3-106
రేకు: 219-5
సంపుటము: 3-106
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ఒరసి చూడఁగబోతే నొకటీ నిజములేదు పొరల మేను ధరించి పొరలఁగఁ బట్టెను | ॥పల్లవి॥ |
| పాతకములట కొన్ని బలుపుణ్యాలట కొన్ని యీతల స్వర్గనరకాలిచ్చేవట యేతుల నందుఁ గొన్నాళ్లు యిందుఁ గొన్నాళ్లు పోతరించి కాతరించి పొరలనే పట్టెను | ॥ఒర॥ |
| పొలఁతులట కొందరు పురుషులట కొందరు వెలుఁగును జీఁకట్లు విహారమట కలవరింతలు గొంత ఘనసంసారము గొంత పొలసి జీవులు రెంటాఁ బొరలఁగఁ బట్టెను | ॥ఒర॥ |
| వొక్కవంక జ్ఞానమట వొక్కవంకఁ గర్మమట మొక్కి ఇహపరాలకు మూలమిదట తక్కక శ్రీవేంకటేశుదాసులై గెలిచిరట పుక్కట నిన్నాళ్లు రెంటాఁ బొరలఁగఁ బట్టెను | ॥ఒర॥ |


