అధ్యాత్మ సంకీర్తన
రేకు: 219-6
సంపుటము: 3-107
రేకు: 219-6
సంపుటము: 3-107
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| మదించిన యేనుగను మావటీఁడు దిద్దినట్టు త్రిదశవంద్యుఁడ నీవే తిప్పఁగదే మనసు | ॥పల్లవి॥ |
| నేరమి సేసినవాఁడు నిక్కపుటేలికఁగని తారితారి యిందునందు దాఁగినయట్టు తీరని పంచేంద్రియాల దిమ్మరియై తిరిగాడి కోరి నీపై భక్తియంటే కొలుపదు మనసు | ॥మదిం॥ |
| పగసేసుకొన్నవాఁడు బలు మందసములోన వెగటు జాగరముల వేగించినట్టు మిగుల వేదమార్గము మీరి పాపమునఁ జిక్కి జిగి నిన్నుఁ జేరుమంటే జింతించీ మనసు | ॥మదిం॥ |
| నిరుఁబేదయైనవాఁడు నిధానము పొడగని గరిమ భ్రమసి యట్టే కాచుకున్నట్టు యిరవై శ్రీవేంకటేశ యిట్టే నిన్నుఁ బొడగని వెరవున నీగుణాలు వెదకీని మనసు | ॥మదిం॥ |


