అధ్యాత్మ సంకీర్తన
రేకు: 19-2
సంపుటము: 1-114
రేకు: 19-2
సంపుటము: 1-114
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి[1]
| అప్పులేని సంసార మైన పాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైనఁ జాలు | ॥అప్పులేని॥ |
| కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలు చింతలేని యంబలొక్క చేరెఁడే చాలు జంతగాని తరుణి యేజాతైన నదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు | ॥అప్పులేని॥ |
| తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలు ముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలు వట్టి జాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు | ॥అప్పులేని॥ |
| లంపటపడని మేలు లవలేశమే చాలు రొంపి కంబమౌకంటే రోయుటే చాలు రంపపుఁ గోరిక కంటే రతి వేంకటపతి పంపున నాతనిఁ జేరే భవమే చాలు | ॥అప్పులేని॥ |
[1] నిడురేకు 88- దేసాళం.


