Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 220-2
సంపుటము: 3-109
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
గోవింద హరి గోవింద గునిసి యాడుదం బిటురారో
ఆవటించి మనమెట్టు గడచెదము ఆశ్చరియంబిది హరిమాయా
॥పల్లవి॥
కర్మానుగుణము కాలము
ధర్మానుగుణము దైవము
మర్మము రెంటికి మనుజుఁడు
అర్మిలిఁ బొదిగీ హరిమాయా
॥గోవిం॥
అజ్ఞానహేతువు లాసలు
విజ్ఞానహేతువు విరతొకటి
తజ్ఞులు రెంటిఁ దగిలిరి (?)
జిజ్ఞాను(సు?) గప్పెను శ్రీహరిమాయా
॥గోవిం॥
సకలకారణము సంసారము
ప్రకటకారణము ప్రపంచము (?)
అకటా శ్రీవేంకటాద్రీశుదాసులు
వొకరిఁ దడవదువో హరిమాయా
॥గోవిం॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము