అధ్యాత్మ సంకీర్తన
రేకు: 19-4
సంపుటము: 1-116
రేకు: 19-4
సంపుటము: 1-116
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
ఘనుఁ డీఁతఁడొకఁడు గలుగఁగఁ గదా వేదములు జననములుఁ గులము లాచారములుఁ గలిగె | ॥ఘను॥ |
కలుషభంజనుఁ డితఁడు గలుగఁగఁ గదా జగతిఁ గలిగె నిందరి జన్మగతుల నెలవు మలసి యితఁడొకఁడు వొడమఁగఁ గదా యిందరికి నిలువ నీడలు గలిగె నిధినిధానములై | ॥ఘను॥ |
కమలాక్షుఁ డితఁడు గలుగఁగఁ గదా దేవతలు గమిగూడి రిందరును గండి గడచి ప్రమదమున నితఁడు నిలుపఁగఁ గదా సస్యములు అమర [1]ఫలియించె లోకానందమగుచు | ॥ఘను॥ |
గరిమె వేంకటవిభుఁడొకఁడు గలుగఁగఁ గదా ధరయు నభమును రసాతలము గలిగె పరమాత్ముఁడితఁడు లోపల గలుగఁగాఁ గదా అరిది చవులును హితవు లన్నియునుఁ గలిగె | ॥ఘను॥ |
[1] ‘అమరఁ బలియించె’ రేకు.