అధ్యాత్మ సంకీర్తన
రేకు: 19-5
సంపుటము: 1-117
రేకు: 19-5
సంపుటము: 1-117
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
చూడుఁ డిందరికి సులభుఁడు హరి తోడునీడయగు దొరముని యితఁడు | ॥చూడు॥ |
కైవల్యమునకుఁ గనకపు తాపల త్రోవై శ్రుతులకుఁ దుదిపదమై పావనమొక రూపమై విరజకు నావై [1]యున్నాఁడిదె యితఁడు | ॥చూడు॥ |
కాపాడఁగ లోకములకు సుజ్ఞాన- దీపమై[2] జగతికిఁ దేజమై పాపా లడఁపఁగ భవపయోధులకు తేపై [3]యున్నాఁడిదే యితఁడు | ॥చూడు॥ |
కరుణానిధి రంగపతికిఁ గాంచీ- వరునకు వేంకటగిరిపతికి నిరతి నహోబలనృకేసరికిఁ ద- త్పరుఁడగు శఠగోప(ం)ముని యితఁడు | ॥చూడు॥ |
[1] నిడురేకు 88- భువినున్నాఁడిదె.
[2] నిడురేకు 88- ంబై జగతికిఁ దొడవై.
[3] నిడురేకు 88- జగములఁ దిరిగీ నితఁడు (లయచ్ఛాయ కీపాఠములే యుక్తములు).