అధ్యాత్మ సంకీర్తన
రేకు: 19-6
సంపుటము: 1-118
రేకు: 19-6
సంపుటము: 1-118
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| కలలోని సుఖమే[1] కలియుగమా, వెన్న కలిలో నెక్కడిదె కలియుగమా | ॥కలలోని॥ |
| కడిగడి గండమై కాలము గడపేవు కడుగఁ గడుగ రొంపి కలియుగమా బడలికె వాపవు పరమేదో చూపవు గడిచీటియును నీవు కలియుగమా | ॥కలలోని॥ |
| కరపేవు కఱతలే మఱపేవు మమతలే కరకఱ విడువవు కలియుగమా తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు గరుసేల దాఁటేవో కలియుగమా | ॥కలలోని॥ |
| కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు కానీలే కానీలే కలియుగమా పైనిదే వేంకటపతి దాసులుండఁగ కానవా నీ విదేమి కలియుగమా | ॥కలలోని॥ |
[1] నిడురేకు 88- సుఖమైన.


