అధ్యాత్మ సంకీర్తన
రేకు: 227-3
సంపుటము: 3-152
రేకు: 227-3
సంపుటము: 3-152
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| సర్వసులభుఁ డితఁడు సర్వేశ్వరుఁడు గర్వముఁ బాసితేను కానవచ్చు నితని | ॥పల్లవి॥ |
| చింతలెల్లా నుడిగితే శ్రీపతి యందేవుండు మంతనాన నుండితేను మరి నాతఁడే పంతపు వుబ్బు మానితే పరమాత్ముఁడు దోడౌను వింతలు దలఁచకుంటే విశ్వరూపమే | ॥సర్వ॥ |
| వెడకర్మాలు దోసితే విష్ణుని సాన్నిధ్యమబ్బు కడునాస లొల్లకుంటే కలఁడాతఁడు వొడ లోముకొనకుంటే వుపేంద్రుఁడు రక్షించు పొడిఁబడకుంటేనే పూర్ణభావ మలరు | ॥సర్వ॥ |
| ఇతర మెరఁగకుంటే నిందిరానాథుఁడు మెచ్చు సతిబారిఁ బడకుంటే జంటౌ నాతఁడు హితవులు గోరకుంటే నెదుటఁ శ్రీపతి నిల్చు జితేంద్రియవ్రతమందే శ్రీవేంకటేశుఁడు | ॥సర్వ॥ |


