అధ్యాత్మ సంకీర్తన
రేకు: 227-5
సంపుటము: 3-154
రేకు: 227-5
సంపుటము: 3-154
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| ఎందుఁ జూచినా నీవే ఇదివో నీ ప్రతాపము నందకధరుఁడ నీకు నమో నారసింహా | ॥పల్లవి॥ |
| అచ్చలపు బ్రహ్మాండమది నీకుఁ బెద్దగుహ చెచ్చెర నహోబలాద్రి సింహాసనము అచ్చటఁ గనకదైత్యుఁ డాహారపుమెగము విచ్చనవిడిఁ జెలఁగు విజయనారసింహా | ॥ఎందుఁ॥ |
| జలధు లేడును నీకు జలకపు మడుగులు అలరి భూమెల్లా విహారదేశము కెలన రేలుఁబగళ్లు కిందిమీఁది రెప్పలు వెలయఁగ విహరించు విజయనారసింహా | ॥ఎందుఁ॥ |
| చక్కటి శ్రీమహాదేవి జంటైన ఆడుసింహము నిక్కపు దేవతలెల్లా నీ పిల్లలు యెక్కవై శ్రీవేంకటాద్రి నిన్నిటా భోగించేవు వెక్కసమై మమ్మేలుకో విజయనారసింహా | ॥ఎందుఁ॥ |


