అధ్యాత్మ సంకీర్తన
రేకు: 228-4
సంపుటము: 3-159
రేకు: 228-4
సంపుటము: 3-159
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| సర్వేశ్వరా నీకు శరణుచొచ్చితి మిదే వుర్విలోన నేమెంచే వుపమ లేమున్నవి | ॥పల్లవి॥ |
| వెలయ నేమిటికైనా వెరవకుండేనంటే యెలమి ధైర్యము నీవియ్యక లేదు బలిమి చూపెద నేపట్టుననైనా నంటే చెలఁగి నీవే లోని చేతనాత్మకుఁడవు | ॥సర్వే॥ |
| జగములోపల నేనెచ్చరికై వుండేనంటే అగపడి బుద్ధి నీవియ్యక లేదు పగటు సంసారము భ్రమ విడిచేనంటే మగటిమిగల నీవు మాయానాథుఁడవు | ॥సర్వే॥ |
| కేవల మీ పుట్టుగును గెలిచి వుండేనంటే ఆవేళ నీవు ముక్తియ్యక లేదు శ్రీవేంకటేశ్వర నీకు చేకానుకిచ్చేనంటే లావుసంపదల నీవు లక్ష్మీనాథుఁడవు | ॥సర్వే॥ |


