అధ్యాత్మ సంకీర్తన
రేకు: 229-1
సంపుటము: 3-162
రేకు: 229-1
సంపుటము: 3-162
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ఒకరి కొకరు వొడ్డు దప్పులనే పకపక నవ్వు పచరించేరు | ॥పల్లవి॥ |
| కొట్టీ నుట్లదె గోవిందుఁ డంతలో తిట్టేరు గోపసతీమణులు పట్టీ జన్నులట్టే పైపై గోవిందుఁడు మెట్టెల పాదాల మెట్టే రింతులు | ॥ఒక॥ |
| వారవట్టీఁ బాలు వంచి గోవిందుఁడు గోర గీరే రదే గొల్లెతలు చీర లంటీనట్టె చెంది గోవిందుఁడు మేరతోఁ గొప్పు వంచి మించే రింతులు | ॥ఒక॥ |
| కెలసి వెన్నారగించీ గోవిందుఁడు తొలఁగఁ దోసేరు దొడ్డవారు కలసెను శ్రీవేంకటాద్రి గోవిందుఁడు అలమేరు మరి నంగనలు | ॥ఒక॥ |


