అధ్యాత్మ సంకీర్తన
రేకు: 229-2
సంపుటము: 3-163
రేకు: 229-2
సంపుటము: 3-163
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| మదనజనకునికి మజ్జనవేళ పదివేలు భోగములు పరగీనదె | ॥పల్లవి॥ |
| వున్నతి వేద ఘోషాల నుర్వీధరుని మీఁద పన్నీటి కాలువలు పారీనదె మున్నిటి మునుల హస్తములఁ గప్పురపుధూళి కన్నులపండుగగాఁ గప్పీనదె | ॥మద॥ |
| సేసలుగా నలువంక శ్రీసతి విభునిమీఁద వాసన తట్టుపుణుఁగు వడిసీనదె భాసురపుఁ జంద్రగావిపట్టుదట్టి కాంతలెల్లా ఆసల మొలఁ గట్టగా నమరీనదె | ॥మద॥ |
| చెలరేఁగి సొమ్ములెల్లా శ్రీవేంకటేశ్వరు మేన నెలకొని కాంతులతో నిండీనదె అలమేలుమంగ వురమందు నెలకొని యట్టె సలిగె గృపారసము చల్లీనదె | ॥మద॥ |


