అధ్యాత్మ సంకీర్తన
రేకు: 229-5
సంపుటము: 3-166
రేకు: 229-5
సంపుటము: 3-166
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| చెప్పరాని మహిమల శ్రీదేవుఁడితఁడు కప్పి కన్నుల పండుగగాఁ జూడరో | ॥పల్లవి॥ |
| అద్దుచుఁ గప్పురధూళి యట్టే మేన నలఁదఁగా వొద్దిక దేవునిభావ మూహించితేను మద్దులు విరిచినట్టి మంచి బాలకృష్ణునికి మద్దులకాంతి మేన మలసినటుండె | ॥చెప్ప॥ |
| అమరఁ దట్టుపుణుఁగు అవధరించఁగాను తమితోఁ బోలికెలెల్లఁ దచ్చిచూడఁగా యమునానది నాఁగేట నండకుఁ దీసుకొనఁగా యమునానది నలుపు అంటిన యట్టుండె | ॥చెప్ప॥ |
| అంగముల శ్రీవేంకటాధిపున కింతటాను సింగారించి సొమ్ములెల్లఁ జెలరేఁగఁగా బంగారపు టలమేలుమంగ నురాన నుంచఁగా బంగారము మేననెల్లాఁ బరగినట్టుండె | ॥చెప॥ |


