అధ్యాత్మ సంకీర్తన
రేకు: 230-1
సంపుటము: 3-168
రేకు: 230-1
సంపుటము: 3-168
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఎట్టున్నదో నీచిత్త మెదురాడ నే వెఱతు గట్టిగా హరి నీమాయ కడవఁగరాదు | ॥పల్లవి॥ |
| నిచ్చ పతితులఁ జూచి నేను సంసారినై యుందు అచ్చపు సన్యాసులఁ జూచటువలె నయ్యేనందు హెచ్చి మోచి వచ్చితేను యెక్కడిగొడవ యందు ఇచ్చట నిశ్చలబుద్ధి యెందూ నేఁగానను | ॥ఎట్టు॥ |
| కర్ములఁ జూచొకవేళ కర్మము నేఁ జేయఁబోదు మర్మపు జ్ఞానులఁ జూచి మంచిదందును అర్మిలి రెండూఁ జూచి అంతలో సందేహింతు నిర్మలమయిన బుద్ధి నే నెందుఁ గానను | ॥ఎట్టు॥ |
| వారఁణాసి వోఁజూచి వారివెంటఁ దగులుదు తేరి కొంత దవ్వు వోయి తిరుగుదును నేరిచి శ్రీవేంకటేశ నీవే నన్ను గాచితివి యీ రీతి దేరిన బుద్ధి యెందూ నే గానను | ॥ఎట్టు॥ |


