అధ్యాత్మ సంకీర్తన
రేకు: 230-4
సంపుటము: 3-171
రేకు: 230-4
సంపుటము: 3-171
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా | ॥పల్లవి॥ |
| చవిగొంటి నెత్తురెల్లా చన్నుఁబాలనుచు నేను భువిఁ దొల్లే నోచితి పుట్టేనంటాను యివల గడుపులోన హేయమౌతాఁ గూడవుతా నివిరి నన్నెరఁగను నిన్నెరిఁగేనా | ॥దైవ॥ |
| మొగిఁ జావుకు వెరతు ముందర గాన నేను వెగటు లంపటమైతే వేసరుకొందు వగపును నగవును పడి నొక్క మొకమందే తగులైనవాఁడ నీపై తలఁపు నాకున్నదా | ॥దైవ॥ |
| మతి భ్రమసితిఁ గొంత మన్ను నాకు రాజ్యమని సతులంటా సుతులంటా సంసారినైతి గతియై శ్రీవేంకటేశ కాచితి వింతటిలోనే యితరుఁడ నింతే నీకు నేమి బాఁతి నేను | ॥దైవ॥ |


