అధ్యాత్మ సంకీర్తన
రేకు: 231-2
సంపుటము: 3-175
రేకు: 231-2
సంపుటము: 3-175
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఇంకా నో దైవమా యేల వెఱ్ఱి దవ్వించేవు కొంకి తెంచి ముడిగొంటే కుఱుచే కాదా | ॥పల్లవి॥ |
| పైకొని నీదాసులు బ్రహ్మాదులఁ గొల్వమని లోకులఁ గొల్చితే వారు లోలో నవ్వరా కోక చాకియింట వేసి కొక్కెరాలవెంటఁ బోతే ఆకడ పురుషార్థము నందీనా జీవుఁడు | ॥ఇంకా॥ |
| వుమ్మడిఁ గర్మఫలము వొల్లమని పసిఁడికి నమ్మిక చేయి చాఁచితే నవ్వదా అది కమ్మి శిరసుండఁగా మోకాల సేస వెట్టఁబోతే సమ్మతి నిందరిలోన జాణౌనా జీవుఁడు | ॥ఇంకా॥ |
| సారెకు మాయాప్రపంచమునకు లోనుఁ గాక నారులకు లోనై తే నవ్వరా వారు యీరీతి శ్రీవేంకటేశ ఇన్నిటా నీశరణని కూరవండి కసవేరిఁ గోరీనా జీవుఁడు | ॥ఇంకా॥ |


