అధ్యాత్మ సంకీర్తన
రేకు: 231-3
సంపుటము: 3-176
రేకు: 231-3
సంపుటము: 3-176
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| అమ్మే దొకటియును అసిమలోని దొకటి ఇమ్ముల మాగుణములు యెంచఁ జోటేదయ్యా | ॥పల్లవి॥ |
| యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు | ॥అమ్మే॥ |
| పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము వడి నీ పరతంత్రభావము మాకేది నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ యెడయేది నిన్ను నుతిఇంచేఅందుకును | ॥అమ్మే॥ |
| తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి వెనక ముందెంచక నీవే కావవయ్యా | ॥అమ్మే॥ |


