అధ్యాత్మ సంకీర్తన
రేకు: 231-4
సంపుటము: 3-177
రేకు: 231-4
సంపుటము: 3-177
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| వెఱ్ఱి దెలిసి మరియు వేఁదురు దవ్వేము నేము ముఱ్ఱుఁబాల మంకువాఁడ మూలమా శరణు | ॥పల్లవి॥ |
| తోలు నెముకలు ముట్టి దోసమంటాఁ దీర్థమాడి తోలు నెముకల మేనితోడ నున్నాఁడ వాలిన జీవహింస వద్దని చైతన్యముతో తేలించి శాకపాకాల దిగమింగేము | ॥వెఱ్ఱి॥ |
| బూతునఁ బుట్టినందుకు పుణ్యములెల్లాఁ జేసి బూతుల సంసారమే భోగించేము పాతకములెల్లాఁ బోను బహుదానము లొసఁగి ఆతల నొరులఁ బోయి అడిగేము నేము | ॥వెఱ్ఱి॥ |
| కర్మము లన్నియుఁ దోసి ఘనము క్తిఁ బొందేనంటా కర్మాచరణములే కడుఁ జేసేము నిర్మించి శ్రీవేంకటేశ నేరాలు నన్ను నెంచక ధర్మము దలఁచి నీవే దయఁ జూడవే | ॥వెఱ్ఱి॥ |


