అధ్యాత్మ సంకీర్తన
రేకు: 232-3
సంపుటము: 3-182
రేకు: 232-3
సంపుటము: 3-182
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
| ఇదె నీ కన్నుల యెదిటికి వచ్చితి కదియుచు నెట్టయినఁ గావకపోదు | ॥పల్లవి॥ |
| పరమపురుష నీ భక్తి దొరకకే యిరవగు జన్మము లెత్తితిని హరి నీ కరుణకు నరుహము లేకే దురితవిదుల సందులఁ బడితి | ॥ఇదె॥ |
| జగతీశ్వర నీశరణము లేకే వొగి సంసారపువురిఁ బడితి భగవంతుఁడ నీ పదములు గనకే తెగని పాపముల తీదీపు లైతి | ॥ఇదె॥ |
| గోవిందుఁడ నినుఁ గొలువఁగ నేరకే ధావతి యాసలఁ దగిలితిని శ్రీవేంకటేశ్వర చేరి నీవు నా- దైవమవుగాఁగ ధన్యుఁడ నయితి | ॥ఇదె॥ |


