అధ్యాత్మ సంకీర్తన
రేకు: 233-1
సంపుటము: 3-186
రేకు: 233-1
సంపుటము: 3-186
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఎదిరించి పోట్లాడ నెవ్వరితరము లిఁక త్రిదశవంద్యుఁడు హరిఁ దేరి చూడఁగలరా | ॥పల్లవి॥ |
| ఘాత మీస మదరితే గగ్గులకాడవుదురు యీతఁడు దలచూపితే నెదిరించ రరులు ఆతురాన గొరిశరాయడికి నోపఁగలేరు చేతిగోరు మీటితేనే ఛిన్నభిన్న మవుదురు | ॥ఎది॥ |
| పైపై నితఁ డడుగిడ పాతాళానఁ గుంగుదురు కోపించినంత నెత్తురుగుండాల పాలౌదురు తూపు చేత నంటితేనే తుత్తుమురై పారుదురు రాపునీలికాశ గంటే రణభీతి గొందురు | ॥ఎది॥ |
| మంతన మీతఁ డాడితే మానము గోలుపోదురు కొంత గుఱ్ఱ మెక్కితేనే గుంటఁ గూలిపోదురు యింతటా శ్రీవేంకటేశుఁ డెక్కడఁ జూచినఁ దానే వింత ప్రతాపముతోడ విఱ్ఱవీఁగీ నిదివో | ॥ఎది॥ |


