అధ్యాత్మ సంకీర్తన
రేకు: 233-2
సంపుటము: 3-187
రేకు: 233-2
సంపుటము: 3-187
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| కలిమి గలిగియు నధమగతి యదేల బలిమి గలిగియు లోఁగి బతిమాలనేల | ॥పల్లవి॥ |
| ఇలువేలుపొకఁడు హరి ఇంటనే వుండఁగా పలు వేలుపులతోడి భ్రమతలేల మెలఁగి సూర్యుఁ డొక్కఁడు మిక్కిలిని వెలుఁగఁగా వెల లేని దీపములు వేయి నేమిటికి | ॥కలి॥ |
| హరిభక్తి యొక్కటే ఆత్మలో నుండగా పరయుక్తు లెంచేటి పనులేల సిరులఁ జింతామణటు చేతిలో నుండఁగా సరి గాజుఁబూస మెచ్చఁగ నదేమిటికి | ॥కలి॥ |
| నాలుకను మంచి హరినామ మొకటుండగా గాలిఁ బోయెటి వూరగాథ లేల యీలీల శ్రీవేంకటేశుఁ డెదుటనె వుండగా మూలలకుఁ జేచాఁచి మొక్క నిఁకనేలా | ॥కలి॥ |


