అధ్యాత్మ సంకీర్తన
రేకు: 233-4
సంపుటము: 3-189
రేకు: 233-4
సంపుటము: 3-189
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇట్టి యవివేకబుద్ధి యే పనికి వచ్చునిఁక జట్టిగొని నాగుణము చక్కఁజేయఁ గదవే | ॥పల్లవి॥ |
| హరి నీయిచ్చఁ బ్రపంచమంతా నీవు నడపఁగ అరసి నీశక్తి దెలియక నమ్మక వెర వెరఁగనియట్టి వెఱ్ఱివాఁడ నే నొక్క- దొరనంటాఁ బనుల కుద్యోగించేను | ॥ఇట్టి॥ |
| అంతరాత్మవై నీవు అన్నియుఁ బెర రేఁచఁగ బంతినే నీ మహిమెల్లా భావించక చెంత నీసంసారము సేసేవాఁడ నే నంటా దొంతుల కోరికలతోఁ దూరిపారేను | ॥ఇట్టి॥ |
| ఆదినుండి స్వతంత్రుఁడవై యేలినట్టి నిన్ను సోదించి శరణు నాఁడే చొరఁగలేక యీదెస శ్రీవేంకటేశ యిప్పుడు నీదాఁసుడనై నీ దయ కలిమితోడ నేఁడు మొక్కేను | ॥ఇట్టి॥ |


