అధ్యాత్మ సంకీర్తన
రేకు: 234-1
సంపుటము: 3-192
రేకు: 234-1
సంపుటము: 3-192
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| నేనింత సేసినయట్టి నేరమి మరవవయ్య ఆనుకొని తాళ్లపాక అన్నమయ్యఁ జూచి | ॥పల్లవి॥ |
| నావొళ్లి యపరాధా లెన్నక నిన్ను సారెసారె వేవేలు దూరితి విచారించక కావించి కన్నులలోని కళంకు దెలియలేక ఆవలఁ జందురు నలుపణఁకించినట్లు | ॥నేనిం॥ |
| పాయక నేఁ జేసినట్టి పాపము లెంచుకొనక ఆయాలు మోవనాడితి నదివో నిన్ను మాయల నాదేహమిది మలినమే తలఁచక చాయ లేదని యద్దము సారెఁ దోమినట్లు | ॥నేనిం॥ |
| మదమత్సరాలు నాలో మానకిట్టే వుండఁగాను అదియే నీచేఁతంటా నాడుకొందును యెదలో శ్రీవేంకటేశ యిరవై నీ వుండఁగాను వెదకి వెదకి నీకే వెఱ్ఱిగొన్నయట్లు | ॥నేనిం॥ |


