అధ్యాత్మ సంకీర్తన
రేకు: 234-2
సంపుటము: 3-193
రేకు: 234-2
సంపుటము: 3-193
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా ఆదిగొని భూభార మణఁచీనోయమ్మా | ॥పల్లవి॥ |
| చందురునుదయవేళ సవరేతిరికాడ కందువ దేవకి బిడ్డఁ గనెనమ్మా పొందుగ బ్రహ్మాదులు పురుఁటింటి వాకిటను చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా | ॥ఆది॥ |
| వసుదేవుని యెదుట వైకుంఠనాథుఁడు సిసువై యవతరించి చెలఁగీనమ్మా ముసిముసి నవ్వులతో మునులకు ఋషులకు యిసుమంత వాఁడభయమిచ్చీనమ్మా | ॥ఆది॥ |
| కన్న తల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి అన్నిటా రాకాసిమూఁక లణఁచీనమ్మా వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ పన్ని నిచ్చకల్యాణాలఁ బరగీనమ్మా | ॥ఆది॥ |


