అధ్యాత్మ సంకీర్తన
రేకు: 235-4
సంపుటము: 3-201
రేకు: 235-4
సంపుటము: 3-201
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| ఏమి సేయఁగలవార మెందుకు నౌదుము నేము శ్రీమాధవ నీవే దయఁ జిత్తగించు మమ్మును | ॥పల్లవి॥ |
| వేసరక పుణ్యాలు గావించేదే యరుదుగాని సేసేనంటే పాపములు చేతిలోనివే గాసిలక చూచితేఁ జీఁకటైనా వెలుఁగౌఁగాని వీసమంత మఱచినా వెలుఁగైనాఁ జీఁకటే | ॥ఏమి॥ |
| తెలివితో మోక్షము సాధించేదే యెక్కుడుగాని అలయించే లోకములెన్నైనా గలవు తలఁచితే నీరూపము తానే యెదుటనుండు యిలఁ బరాకై వుండితే నెచ్చోటాఁ జిక్కదు | ॥ఏమి॥ |
| యీవల నీ దాఁసుడయ్యేది ఘనముగాని దావతి రాజసాలంతటా నున్నవి శ్రీవేంకటేశ్వర నీ సేవే ధ్రువపదము దేవతాంతరమెల్లా దిగ్గుడుకు దిగ్గుడు | ॥ఏమి॥ |


