అధ్యాత్మ సంకీర్తన
రేకు: 236-4
సంపుటము: 3-207
రేకు: 236-4
సంపుటము: 3-207
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు జీవుఁడ నింతే నేను శ్రీమన్నారాయణా | ॥పల్లవి॥ |
| నిను నామనసుఁ గొని నేఁ దలఁచేనంటినా మన ప్రకృతిఁ బుట్టె మరి నిన్నెట్టు దలఁచీ తనువుఁ గొని నీసేవ తగిలి సేసేనంటినా తనువు కర్మాధీనము తగిలీనా నిన్నును | ॥నీవే॥ |
| గరిమ నర్థమిచ్చి నీగతి గనేనంటినా హిరణ్య మజ్ఞానమూల మెట్టు నీకు నియ్యనిచ్చీ సిరుల నాజన్మము నీసెలవు సేసేనంటినా సరిఁ బుట్టుగు సంసారసాధ్యము నిన్నంటీనా | ॥నీవే॥ |
| యిలఁ బుణ్యఫలము నీకిచ్చి మెప్పించేనంటినా ఫలము బంధమూల మేర్పడనియ్యనిచ్చీనా నిలిచి శ్రీవేంకటేశ నే నీశరణు చొచ్చితి యెలమి నీకరుణ నన్నెడయనిచ్చీనా | ॥నీవే॥ |


