అధ్యాత్మ సంకీర్తన
రేకు: 236-5
సంపుటము: 3-208
రేకు: 236-5
సంపుటము: 3-208
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| మాయామయములివి మాయకు నీ వేలికవు చాయకుఁ దెచ్చేనంటే స్వతంత్రుఁడ నయ్యేనా | ॥పల్లవి॥ |
| తెగని కోరిక తానే తీఁగెవలె నల్లుకోఁగా తగదని మానుప నా తరమయ్యీనా వగలఁ గోపము పామువలె నాలుక చాఁచఁగ పగటు తోడఁ దొడికి పట్టఁగ నేరుతునా | ॥మాయా॥ |
| వయసు తానే మేఘమువలె సోన గురియఁగా జయించి నే దాని నణఁచఁగ నోపేనా లయించక లోభము జలఁగవలెఁ బీరుచఁగా నియమించి మట్టుపెట్ట నేఁడు నాకు వసమా | ॥మాయా॥ |
| యేపున గర్వము దానే యేనుగవలె మీరఁగా చేపట్టి చిక్కించుకో నాచేత లోనౌనా యేపొద్దు శ్రీవేంకటేశ యివి వాని స్వభావాలు కాపాడవే నన్ను నే నెక్కఁడా నీ దాఁసుడను | ॥మాయా॥ |


