అధ్యాత్మ సంకీర్తన
రేకు: 21-1
సంపుటము: 1-125
రేకు: 21-1
సంపుటము: 1-125
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| [1]పెక్కు లంపటాల మనసు పేదవైతివి నీకు నెక్కడా నెవ్వరు లేరు యేమి సేతువయ్యా | ॥పెక్కు॥ |
| కన్నుమూయఁ బొద్దులేదు, కాలు చాఁచ నిమ్ములేదు, మన్ను దవ్వి కిందనైన మనికి లేదు, మున్నిటివలెనే గోరు మోపనైనఁ జోటు లేదు, యిన్నిటా నిట్లానైతి వేమి సేతువయ్యా | ॥పెక్కు॥ |
| అడుగిడఁగ నవ్వల లేదు, అండనైన నుండలేదు, పుడమిఁ గూడు గుడువనైనఁ బొద్దులేదు, వెడఁగుఁదనము విడువలేదు, వేదమైనఁ జదువలేదు, యెడపఁ దడప నిట్ల నీకు నేమి సేతువయ్యా | ॥పెక్కు॥ |
| వుప్పరములు మానియైన నుండలేదు లోకమందు, నిప్పుడైన నీ విహార మిట్లనాయను చెప్పనరుదు నీ గుణాలు శ్రీవేంకటేశ యిట్ల- నెప్పుడును ఘనుఁడ వరయ నేమి సేతువయ్యా | ॥పెక్కు॥ |
[1] ఇందు దశావతారసమన్వయము కలదు.


