అధ్యాత్మ సంకీర్తన
రేకు: 240-6
సంపుటము: 3-232
రేకు: 240-6
సంపుటము: 3-232
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| కొలిచినవారికిఁ గొమ్మని వరములిచ్చీ వెలయఁ గలశాపుర వీధిహనుమంతుఁడు | ॥పల్లవి॥ |
| బెట్టుగా నొకచేతఁ జూపెడి తన ప్రతాపము పట్టుకున్నాఁ డొకచేతఁ బండ్లగొల మెట్టుకొన్నవి రాకాసిమెదడుతోడి తలలు రట్టడి కలశాపుర దిట్ట హనుమంతుడు | ॥కొలి॥ |
| చెచ్చెర వీనుల నాలించేది సురల నుతులు కొచ్చికొచ్చి తోఁకఁ జుట్టుకొన్నది నింగి తచ్చి చూచేది కన్నుల దాసులమీఁది కరుణ రచ్చకెక్కెఁ గలశాపురము హనుమంతుఁడు | ॥కొలి॥ |
| వసుధ మతిలోనిది స్వామికార్యవిశ్వాసము వెసఁ దన పనైనది విష్ణుభక్తి పసగా శ్రీవేంకటేశ బలు నీ బంట్లలోన రసికుఁడు కలశాపురము హనుమంతుఁడు | ॥కొలి॥ |


