అధ్యాత్మ సంకీర్తన
రేకు: 241-3
సంపుటము: 3-235
రేకు: 241-3
సంపుటము: 3-235
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఉవిదలాల చూడరే వుద్దగిరి కృష్ణుఁడు నవకపు సెలవుల నవ్వుచున్నాఁడు | ॥పల్లవి॥ |
| అచ్చపు బాలుఁడై శకటాసురు మర్దించినాఁడు కుచ్చి కాఁగిళ్ల నింతులఁ గూడినాఁడు మచ్చిక దోఁగెడు తాను మద్దులు విరిచినాఁడు పిచ్చిలఁ బూతకి చన్ను పీరిచినాఁడు | ॥ఉవి॥ |
| పిన్ననాఁడే కోడెలతోఁ బెనఁగి గెలిచినాఁడు యెన్నికగా వేలఁ గొండ యెత్తినాఁడు నెన్నడిని కొండపాము వెస రెండు సేసినాఁడు పన్ని కంసుని మదము భంజించినాఁడు | ॥ఉవి॥ |
| పొంచి పెద్దవాఁడై భూభారము దించినాఁడు అంచెఁ బాండవులకు దిక్కైనవాఁడు మించి శ్రీవేంకటగిరిమీఁద నిదె వున్నవాఁడు వంచించక దాసులకు వరాలిచ్చేవాఁడు | ॥ఉవి॥ |


