అధ్యాత్మ సంకీర్తన
రేకు: 241-4
సంపుటము: 3-236
రేకు: 241-4
సంపుటము: 3-236
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరినాట
| అరుదరుదీగతి యహోబలేశ్వర పొరిఁబొరి దాసులు పొగడుట యెట్టు | ॥పల్లవి॥ |
| యెదుటఁ జించితివి హిరణ్యకశిపుని అదె ప్రహ్లాదుఁడు బంటగుటెట్లు కదిసిన రుద్రుని గర్వ మడఁచితివి గుదిగొని దివిజులు కొలుచుట యెట్టు | ॥అరు॥ |
| ఘనసింహాకృతి గైకొనివుంటివి యెనయఁగఁ గరిఁ గాచిన దెట్లు పనివడి కంబము వగుల వెడలితివి మనుజులు పూజించి మరుగుట యెట్లు | ॥అరు॥ |
| సరవితో వీరరసమున మించితివి అరయఁగ శృంగారివౌటెట్టు సిరిపుర మెక్కెను శ్రీవేంకటాద్రిని యిరవుగ నీ తొడ యెక్కుట యెట్టు | ॥అరు॥ |


