అధ్యాత్మ సంకీర్తన
రేకు: 241-5
సంపుటము: 3-237
రేకు: 241-5
సంపుటము: 3-237
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| నిండు కంతటా నున్నది నీమాయ వొండొకరు జనులకు నుపదేశించనేలా | ॥పల్లవి॥ |
| నేరకుంటే సంసారము నేరుపును నీమాయ చేరకుంటే గడులోను చేసుకొను నీమాయ వూరకొడఁబడకుంటే వొడఁబరచు నీమాయ పోరి బిడ్డలకు తండ్రి బుద్ధి చెప్పవలెనా | ॥నిండు॥ |
| నాలికె కారురుచులు నలిఁ దెలుపు నీమాయ బేలుఁడై విరక్తుఁడై భిక్ష మెత్తించు నీమాయ పాలుమాలేమంకునైనా పనిసేయించు నీమాయ రేలుఁబగళ్లొకరు ప్రేరేఁపుచుండవలెనా | ॥నిండు॥ |
| చొక్కించి నోరుఁ జేతికి సూటి చూపు నీమాయ పెక్కులాగుల నన్నిటాఁ బెనగించు నీమాయ వెక్కసపలమేల్మంగవిభుఁడ శ్రీవేంకటేశ తక్కక నీమహిమిది తలపించవలెనా | ॥నిండు॥ |


