అధ్యాత్మ సంకీర్తన
రేకు: 241-6
సంపుటము: 3-238
రేకు: 241-6
సంపుటము: 3-238
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| మనుజు లూరకే తాము మరఁగులంటా నుందురు యెనసి దేవుఁడు సేసే నిందరికి మాయ | ॥పల్లవి॥ |
| వినికందరి కొక్కటే వివరములే వేరు కనుచూపులు నొక్కటే కాంక్షలే వేరు మనసూ నొక్కటే లోనిమర్మములే వేరు తనివియు నొక్కటే తనువులే వేరు | ॥మను॥ |
| లోకమును నొక్కటే లోనువెలుపల వేరు వాకు లొక్కటే భాషలవరుసే వేరు జోక నాహార మొక్కటే సొరిది రుచులే వేరు కైకొన్నరతి యొక్కటే కందువలే వేరు | ॥మను॥ |
| పరిమళ మొక్కటే భాగించుకొనుటే వేరు యిరవైన దొక్కటే యింపులే వేరు అరిది శ్రీవేంకటేశ అన్నిటా నీదాఁసుడు(ల?) శరణాగతి యొక్కటే జాతులే వేరు | ॥మను॥ |


