అధ్యాత్మ సంకీర్తన
రేకు: 243-3
సంపుటము: 3-244
రేకు: 243-3
సంపుటము: 3-244
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| సరవులు దెలియఁగఁ జనుఁ గాకా పరమార్థములో భంగము గలదా | ॥పల్లవి॥ |
| హరి స్వతంత్రుఁడట హరిసంకల్పము విరసంబౌనా విశ్వమున సరవిఁ బ్రపంచపు సకలమతంబులు వరుస నెంచఁ గొదువలు మఱి కలవా | ॥సర॥ |
| యితఁడు పూర్ణుఁడట యితని విహారము వెతకఁగవలెనా వేమరును కతకరచిన యీకన్ను లెదిటివే మతిఁ దోఁచీనిఁక మఱఁగులు గలవా | ॥సర॥ |
| అంతరాత్మయట అతని వేరే చింతించవలెనా సిలుగులను చెంతనే యిదివో శ్రీవేంకటేశుఁడు యెంత దెలిసినా యితరము గలదా | ॥సర॥ |


