అధ్యాత్మ సంకీర్తన
రేకు: 243-6
సంపుటము: 3-247
రేకు: 243-6
సంపుటము: 3-247
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| అంతటి దైవమ వటు గాఁగా చెంత నిన్నుఁ గూర్చినదే ఘనము | ॥పల్లవి॥ |
| వెరవునఁ బంచమవేద సారములు సిరుల నిను నుతించిన నుతులు సరవితోడి బహుశాస్త్రసంతతులు నిరతిఁ జెప్పెడిని నీకథలు | ॥అంత॥ |
| కొంగుపైడియగు గురుమంత్రంబులు సంగడి వైష్ణవసంభాషలు నింగికి భూమికి నిజపురాణములు సంగతిగల నీ సంకీర్తనలు | ॥అంత॥ |
| వూనిన విధుల మహోపనిషత్తులు నానాగతి నీనామములు వీనులకును శ్రీవేంకటేశ మీ- జ్ఞానార్థములు మిముఁ జదువు చదువులు | ॥అంత॥ |


