అధ్యాత్మ సంకీర్తన
రేకు: 244-1
సంపుటము: 3-248
రేకు: 244-1
సంపుటము: 3-248
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| ఏపాటి గలవాఁడ నిదివో నేను నా పాటు చూచి హరి నన్నుఁ గావఁ గదవే | ॥పల్లవి॥ |
| నిలువు నూరు వండీని(?) నిచ్చలు నీదేహమైతే వొలిసీ దుఃఖములకు నోరువ లేదు కులము గోటిసేసును గుంపుల జన్మాదులైతే అలరి వొరులఁబోయి అడిగేదే యెపుడు | ॥ఏపా॥ |
| పట్టితే పసిఁడి రాలీ బచ్చన సంసారము గుట్టుదెలియఁ బ్రాణము కూటిచేతిది వుట్టిపడీ మానుషము వొకనాటి కొకనాఁడు పట్టికాంతలయెదుట భంగపడే మిదివో | ॥ఏపా॥ |
| చేరి చెట్టడిచితేను చేటఁడు చుట్టరికాలు యీరీతి నిన్నాళ్లదాఁకా నెందుండిరో ఆరిచితే మూరెఁడెక్కీనదే నామకీర్తనము కూరిమి శ్రీవేంకటేశ కొన నాలికెకును | ॥ఏపా॥ |


