అధ్యాత్మ సంకీర్తన
రేకు: 2-7
సంపుటము: 1-13
రేకు: 2-7
సంపుటము: 1-13
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
మలసీఁ జూడరో మగసింహము అలవి మీఱిన మాయలసింహము | ॥మలసీ॥ |
అదివో చూడరో ఆదిమపురుషుని పెదయౌభళముమీఁది పెనుసింహము వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు కదిసి కానఁగలేని ఘనసింహము | ॥మలసీ॥ |
మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి చిచ్చఱకంటితోడి జిగిసింహము తచ్చిన వారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చి నచ్చిన గోళ్ళ శ్రీనరసింహము | ॥మలసీ॥ |
బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడు అంకపు దనుజసంహారసింహము వేంకటనగముపై వేదాచలముపై కింక లేక వడిఁ బెరిగిన సింహము | ॥మలసీ॥ |