అధ్యాత్మ సంకీర్తన
రేకు: 251-5
సంపుటము: 3-294
రేకు: 251-5
సంపుటము: 3-294
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పూర్వగౌళ
| ఏమని చెప్పీనో కాక యిలఁగల శాస్త్రాలు కామించి వాదించేవారి కడ మేదో | ॥పల్లవి॥ |
| అంచెల జగములకు హరియే ఆధారము యెంచఁగ నాధారము యితని కేదో పొంచిన వేదార్థముల పురుషార్థ మీతఁడు నించిన యర్థము యీతనికి నేదో | ॥ఏమ॥ |
| పొందిన ప్రాణులకెల్లా పుట్టుగైనాఁ డితఁడు యెందును తనకుఁ బుట్టుగిఁక నేడో చందపుఁ గర్మములకు సాధన మీదేవుఁడు మందలించ సాధనము మరి తనకేదో | ॥ఏమ॥ |
| కలయన్ని మాయలకుఁ గారణ మీ మూరితి తలపఁగ కారణము తనకేదో యెలమి శ్రీవేంకటేశుఁ డితఁడే సర్వసాక్షి మలసి యీతని కిఁక మరి సాక్షి యేదో | ॥ఏమ॥ |


