అధ్యాత్మ సంకీర్తన
రేకు: 252-3
సంపుటము: 3-298
రేకు: 252-3
సంపుటము: 3-298
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| వేఁకునఁ దిరుపళచ్చి విష్ణునికిఁ జేయరో ఆఁకటి కొదగినట్టి ఆరగింపులు | ॥పల్లవి॥ |
| అతి బ్రహ్మాండాలు గుక్షి నటు ధరించినయట్టి- అతనికిఁ జేయరో ఆరగింపులు ప్రతిలేని క్షీరాబ్ధిఁ బవళించి లేచినట్టి- చతురునికిఁ జేయరో చవి నారగింపులు | ॥వేఁకు॥ |
| యేడుదినములదాఁకా నెత్తెను గోవర్ధనము ఆడివచ్చే బాలునికి నారగింపులు మేడెపు గోపికలతో మిక్కిలిఁ బెనఁగినట్టి- వేడుకకానికిఁ దేరో విందు లారగింపులు | ॥వేఁకు॥ |
| పట్టపుదేవుళ్లుఁ దాను బంతి సాగి వున్నవాఁడు అట్టె సేయరో పులుఁగ మారగింపులు నెట్టన శ్రీవేంకటాద్రినిలయుఁ డారగించీని మట్టులేక వడ్డించరో మంచి యారగింపులు | ॥వేఁకు॥ |


