అధ్యాత్మ సంకీర్తన
రేకు: 252-6
సంపుటము: 3-301
రేకు: 252-6
సంపుటము: 3-301
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| మొక్కరో మొక్కరో వాఁడె ముందర నిలుచున్నాఁడు యెక్కువ రామునిబంటు యేకాంగవీరుఁడు | ॥పల్లవి॥ |
| పెట్టిన జంగతోడి పెద్ద హనుమంతుఁడు పట్టేను యెడమచేతి బలుముష్టి మెట్టినాఁడు పాదముల మించు రాకాశితలలు కొట్టేననుచు నెత్తె గొప్ప వలకేలు | ॥మొక్క॥ |
| వంచెను శిరసుమీఁద వాలుగాఁ దన తోఁక పెంచెను మిన్నులుమోవ పెనుదేహము నించినాఁడు రౌద్రము నిడుపాటిదవడల కాంచనపు పుట్టుకాశ కడు బిగిఇంచెను | ॥మొక్క॥ |
| పెనచి తొడలుదాఁక పెద్ద పదకము వేసె తనువుపై వేలాడే దండల తోడ అనయము శ్రీవేంకటాద్రిదేవుని బంటు వెనుబలమై యున్నాఁడు విట్ఠలములోనను | ॥మొక్క॥ |


