అధ్యాత్మ సంకీర్తన
రేకు: 253-3
సంపుటము: 3-304
రేకు: 253-3
సంపుటము: 3-304
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| రామభద్ర రఘువీర రవివంశతిలక నీ- నామమే కామధేనువు నమో నమో | ॥పల్లవి॥ |
| కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ రాసికెక్క(క్కు?)కోదండరచన విద్యాగురువ వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా | ॥రామ॥ |
| మారీచసుబాహుమర్దన తాటకాంతక దారుణవీరశేఖర ధర్మపాలక కారుణ్యరత్నాకర కాకాసురవరద సారెకు వేదవిదులు జయ వెట్టేరయ్యా | ॥రామ॥ |
| సీతారమణ రాజ శేఖరశిరోమణి భూతలపు టయోధ్యాపురనిలయా యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన రాఘవ ఘాత నీ ప్రతాపమెల్లాఁ గడు నిండెనయ్యా | ॥రామ॥ |


