అధ్యాత్మ సంకీర్తన
రేకు: 255-4
సంపుటము: 3-317
రేకు: 255-4
సంపుటము: 3-317
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| పెరిగి పెద్దఁ గాను మరి పిన్నవాఁడఁ గాను యిరవుగ నే బుద్ధెరిఁగెడి దెపుడు | ॥పల్లవి॥ |
| కంకిగ బహునరకంబులు చొచ్చితి- నింకా భయమది యెరఁగను జంకెనలనే పలుచదువులు చదివితి మంకుఁదనం బిది మానదు | ॥పెరి॥ |
| తియ్యక కడుఁ బెనుదేహాలు మోచితి- నయ్యో యింకా నలయను నెయ్యపు హేయము నిచ్చలుఁ గడిగెద చియ్యని రోయను సిగ్గూఁ బడను | ॥పెరి॥ |
| ధర్మము సేసితి దానము లొసఁగితి కర్మములింకాఁ గడవను అర్మిలి శ్రీవేంకటాధిప నీకృప నిర్మలమైతిని నే నిపుడు | ॥పెరి॥ |


