అధ్యాత్మ సంకీర్తన
రేకు: 255-6
సంపుటము: 3-319
రేకు: 255-6
సంపుటము: 3-319
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| కానరు నాలుగు కరములవానిని శ్రీనాథుండని చేరఁగవలదా | ॥పల్లవి॥ |
| ఘనచక్రముతో గరుడనినెక్కుక కినిసి మెరయు నలకృష్ణునిని ఘనులై ఇప్పటికాలపు మనుజులు మునుప విష్ణుఁడని మొక్కఁగవలదా | ॥కాన॥ |
| పలుదేవతలకు భయములు మాన్పుచు అల విశ్వరూపమైనపుడు చలము మాని యచ్చటికౌరవులును తెలిసి దేవుఁడని కొలువఁగవలదా | ॥కాన॥ |
| చెప్పిన యితఁడే శ్రీవేంకటమున యెప్పుడు వరములు ఇయ్యఁగను తప్పక యీతని దాసులవలెనే యిప్పటివారలె యెరఁగఁగవలదా | ॥కాన॥ |


