అధ్యాత్మ సంకీర్తన
రేకు: 256-5
సంపుటము: 3-324
రేకు: 256-5
సంపుటము: 3-324
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| పంచేంద్రియములనే పట్టణస్వాములాల తెంచి బేరమాడుకొని దించరో బరవు | ॥పల్లవి॥ |
| తగిన సంసారసముద్రములోనఁ దిరిగాడి బిగువుదేహపు టోడబేహారివాఁడ జగతిఁ బుణ్యపాపపు సరకులు దెచ్చినాఁడ దిగితి బూతురేవునఁ దీరుచరో సుంకము | ॥పంచేం॥ |
| అడరి గుణత్రయములనేటి తెడ్డుల చేత నడుమ నిన్నాళ్ళదాఁకా నడపినాడ కడుఁజంచలములనే గాలిచాప లెత్తినాఁడ వెడమాయపు సరకు వెలకియ్యరో | ॥పంచేం॥ |
| ఆతుమయనేటి కంభ మంతరాత్ముఁ డెక్కియుండి నీతితో మమ్ముఁగాచుక నిలుచున్నాఁడు ఆతఁడే శ్రీవేంకటేశుఁ డటు మాకు మీకుఁ గర్త ఘాతమాని ఇఁక మాకు కడుగుణ మియ్యరో | ॥పంచేం॥ |


