అధ్యాత్మ సంకీర్తన
రేకు: 256-6
సంపుటము: 3-325
రేకు: 256-6
సంపుటము: 3-325
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఏడే జేనలు యీదేహంబును యేడా నిఁకమరి యెరఁగము నేము | ॥పల్లవి॥ |
| నిండును జలధులు నిమిషమాత్రమున నిండియు నిండదు నెఱి మనసు పండును భువిఁగల పంటలన్నియును పండదు నాలోఁ బాపపు మనసు | ॥ఏడే॥ |
| పట్టవచ్చు నల పారేటి పామును పట్టరాదు నాపాయము అట్టే ఆరును అనలము నీటను యెట్టైన నారదు యీకోపంబు | ॥ఏడే॥ |
| కానవచ్చు నదె ఘనపాతాళము కానరాదు నాకాలము శ్రీనగవిహార శ్రీవేంకటేశ్వర సోనలఁ బుట్టిన సుద్దులు నివిగో | ॥ఏడే॥ |


