అధ్యాత్మ సంకీర్తన
రేకు: 261-2
సంపుటము: 3-350
రేకు: 261-2
సంపుటము: 3-350
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| పాపము పాపము ప్రజలాలా పైపై నిటువలెఁ బలుకకురో | ॥పల్లవి॥ |
| హరియందుఁ బుట్టినజుఁడును శివుఁడును హరితో సరి వీరనుటెట్లూ పొరిఁ గొండలందుఁ బుట్టిన శిలలివి వరుసఁ బెట్టితే సరియౌనా | ॥పాప॥ |
| యిందిరాధిపుని విలఁగల సిరులివి అంది మరొకరివి అనుటెట్లు కొందరము యేరుగుడిచి కాలువలఁ బొంది పొగడితేఁ బొసఁగీనా | ॥పాప॥ |
| శ్రీవేంకటపతి సేవకులకు సరి ఆవల మరి కలరనుటెట్లు కావించిన యల కామధేనువుల- కేవి యూరఁబసు లీడవునా | ॥పాప॥ |


